
అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి అజిత్ కు ఎలాంటి దెబ్బలు లేకుండా బయటపడ్డాడు .. దీంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు .. ఇక ఈ ప్రమాదంలో హీరో తప్ప ఏమీ లేదని .. ఇతర కార్ల వల్ల ఈ ఘటన జరిగిందని అజిత్ రేసింగ్ టీం చెప్పుకొచ్చింది .. అయితే ఈ ప్రమాదం జరిగిన కొంత సమయానికి అజిత్ బయటకు వచ్చి అభిమానులతో ఫోటోలు కూడా దిగారు . ఈ రేస్ కొనసాగుతున్నట్లు కూడా చెప్పారు .. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోను చూసి అజిత్ అభిమానులు కొంత కలవర పడుతున్నారు .. అలాగే హీరో జాగ్రత్తగా ఉండాలని కూడా కామెంట్లో పెడుతున్నారు .
అయితే స్టార్ హీరో అజిత్ కు రేసింగ్ అంటే ఎంతో ఇష్టం ఈ క్రమంలోనే అజిత్ రేసింగ్ పేరుతో తన టీమ్ ను సైతం ప్రకటించారు .. దుబాయ్ రేసింగ్ ఈవెంట్లు ఆయన టీం విజయం సాధించింది .. ఇక ప్రస్తుతం ఆయన సినిమాల విషయాని కొస్తే అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్‌లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా లో నటిస్తున్నాడు .. ఇక ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది .. ఈ సినిమా ఏప్రిల్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. .