సాధారణంగా చిత్ర పరిశ్ర‌మ‌లో  రాణించాలంటే అందం ఎంతో ముఖ్యం .. ఇక దానికోసం సెలబ్రిటీలు రకరకాల ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని అందాన్ని పెంచుకుంటారు .. అయితే వాటి గురించి చాలామంది బహిరంగంగా బయట చెప్తే మరికొందరు మాత్రం అలాంటివి ఏమీ లేదని దాటేస్తుంటారు .. కానీ ఈ హీరోయిన్ మాత్రం అవును సర్జరీ చేయించుకున్నాను .. అవకాశం వచ్చినప్పుడు వాడుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది .. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు .. ఏంటి ఆ సంగతులు అనేది ఇక్కడ తెలుసుకుందాం.


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. ఇక ఈ బ్యూటీ స్టార్ హీరో కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది .. అలానే తెలుగు , హిందీ , తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది .. ఇక తెలుగులో మహేష్ బాబు , అల్లు అర్జున్ , రామ్ చరణ్ , ప్రభాస్ , పవన్ కళ్యాణ్ , చిరంజీవి , బాలకృష్ణ వంటి అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది .. అలాగే భాష్యతో సంబంధం లేకుండా సినిమాలు నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రజినీకాంత్ కు జంటగా కూలీ సినిమాలో కీలకపాత్రలో నటిస్తుంది .. అలాగే దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్‌’  లోనూ ఈమె నటిస్తున్నట్టు తెలుస్తుంది ..


అయితే ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా  శృతిహాసన్ ప్లాస్టిక్ సర్జరీ గురించి షాకింగ్ కామెంట్లు చేసింది .. అందులో ఆమె మాట్లాడుతూ నేను నా మొఖాన్ని నాకు నచ్చినట్టు సరి చేసుకున్నాను నా ముక్కు ఇంతకుముందు భిన్నంగా ఉండేది అంతకు ముందు నేను నా మొదటి సినిమా చేశాను షూటింగ్ సమయంలో నా ముక్కు గాయమైంది. ఇక దాంతో వైద్యం చేయించుకున్నాను దాన్ని అవకాశం తీసుకొని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను .. ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు ఉపయోగించుకోకూడదు అనుకున్నాను దాని గురించి చెప్పడానికి ఎలాంటి నాకు మొహమాటం లేదు . ఇది నా శరీరం నా ఇష్టం నా శరీరంలో మార్పులు చేసుకోవడం నా ఇష్టం నేను సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది .. ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: