మంచు విష్ణు  డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప గురించి చాలా రోజుల నుండి విమర్శలు వస్తున్నాయి. పోస్టర్స్ విడుదలైనప్పటి నుండి ఎన్నో ట్రోల్స్ వినిపించాయి. అయితే ఈ ట్రోల్స్ అన్నింటికి తెరపడేలా తాజాగా మంచు విష్ణు నటించిన శివ శివ అనే సాంగ్ మేకింగ్ చూసి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఈ పాట కోసం మంచు విష్ణు ఎంత కష్టపడ్డారో చాలా క్లియర్ గా మేకింగ్ వీడియోలో కనిపిస్తోంది. దీంతో విష్ణుని మెచ్చుకుంటున్నారు. అయితే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప మూవీలో భారీ తారాగణాన్ని తీసుకున్నారు. ప్రతి ఇండస్ట్రీ నుండి ఒక్కొక్క నటుడిని తీసుకొని సినిమాకి అన్ని ఇండస్ట్రీలలో భారీ హైప్ ఉండేలా సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్,అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్,కాజల్ వంటి భారీ తారాగణాన్ని తీసుకున్నారు.


అలా ఎన్నో అంచనాలతో వస్తున్న ఈ సినిమాపై తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మంచు విష్ణు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కన్నప్ప మూవీ బడ్జెట్ గురించి ఆలోచిస్తేనే గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. కానీ ఈ సినిమా సక్సెస్ మీద తనను పూర్తి నమ్మకం ఉంది. అలాగే ఆ శివుడు స్వయంగా ప్రత్యక్షమై నాకేదైనా వరం ఇస్తానంటే.. తాను   జన్మజన్మలకి మోహన్ బాబు కుమారుడిలా పుట్టాలని కోరుకుంటాను.నాకు ఉమ్మడి కుటుంబం అంటే  ఇష్టం,నా పిల్లలు అలాంటి వాతావరణం లోనే పెరగాలని కోరుకుంటున్నాను.తమ కుటుంబంలో ఉండే గొడవకు త్వరలోనే పులిస్టాప్ పడాలని నేను కోరుకుంటున్నానని మంచు విష్ణు వెల్లడించారు.

ఇదే ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. చాలా రోజుల నుండి ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్నాయి. నాకు ప్రభాస్ మంచి మిత్రుడే.. కానీ ఆయన పెళ్లి, కాబోయే భార్య గురించి మాత్రం నాకు ఎలాంటి సమాచారం తెలియదు. ఆ డీటెయిల్స్ ప్రభాసే బయట పెట్టాలి అన్నట్లుగా మంచు విష్ణు వెల్లడించారు. కన్నప్పకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: