సాయి పల్లవి ..అందరు హీరోయిన్స్ లా కాదు . ఆమె రూటే సపరేటు . డబ్బు కోసం సినిమాలు చేయదు . కోట్లు ఇచ్చినా సరే లిప్ లాక్ సీన్స్ లో నటించదు . ఆమె కమిట్మెంట్ ఇవ్వదు . సినిమాల కోసం మాత్రమే వర్క్ చేస్తుంది . కాగా కంటెంట్ నచ్చితే ఎలాంటి సినిమాలు అయినా నటించే సాయి పల్లవి ఒక్క సీన్ నచ్చకపోయినా సరే అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమానైనా అవలీలగా రిజెక్ట్ చేసేస్తుంది . అస్సలు ఆలోచించదు . అలా మెగాస్టార్ చిరంజీవి సినిమాని కూడా రిజెక్ట్ చేసింది . ఈ విషయాన్ని స్వయానా మెగాస్టార్ చిరంజీవినే ఓ  ఈవెంట్ లో బయట పెట్టాడు .


అయితే రీసెంట్గా అమరణ్ అదే విధంగా తండేల్ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది సాయి పల్లవి . సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా పెరిగిపోయింది అనేది కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . రీసెంట్ గా ఓ  ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ నేషనల్ అవార్డు కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ తన కోరికను బయట పెట్టింది .



"తన బామ్మ ఇచ్చిన చీరను నేషనల్ అవార్డు అందుకునేటప్పుడు కట్టుకోవాలని ఆశపడుతున్నాను అని.. తన బామ్మ తన పెళ్లి టైంలో కట్టుకోమంటూ ఇచ్చింది అని .. అయితే అది నాకు ఎంతో స్పెషల్ మూమెంట్ అయినా నేషనల్ అవార్డు గెలుచుకున్నాక అవార్డు తీసుకునేటప్పుడు కట్టుకోవాలి అనుకుంటున్నాను అంటూ బయట పెట్టింది". దీనితో సోషల్ మీడియాలో సాయి పల్లవి కి నేషనల్ అవార్డు వస్తుందా..? రాదా ..? అనే విషయం ఎక్కువగా మాట్లాడుతున్నారు జనాలు.



అఫ్కోర్స్ సాయి పల్లవి మంచి టాలెంటెడ్ నటిఏ.  కానీ సాయి పల్లవికి నేషనల్ అవార్డు వచ్చే అంత సినిమాలు ఆమె ఖాతాలో పడలేదు అని .. ఆమె చూస్ చేసుకున్న సినిమాలు బాగుంటాయి కానీ అంత హై లెవెల్ సినిమాలు కాదు అని ఇప్పుడు అప్పట్లో ఆమెకు నేషనల్ అవార్డు రాదు అంటున్నారు. అంతేకాదు అమరణ్  సినిమా కి  నేషనల్ అవార్డ్ వస్తే బాగుంటుంది  అని ఆశపడుతున్నారు. కాగా సాయి పల్లవి నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటుంది అని కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు. సోషల్ మీడియాలో ఇప్పుడు సాయి పల్లవి పెళ్లి మ్యాటర్ వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: