
శేఖర్ కమ్ముల తమ సినిమా టైటిల్ ను శేఖర్ కమ్ముల కుబేర పేరుతో ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అయితే శేఖర్ కమ్ముల అనే పదాలు చిన్నగా ఉన్నాయని కుబేర టైటిల్ పెద్దగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే శేఖర్ కమ్ముల ఈ ఆరోపణల గురించి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శేఖర్ కమ్ముల బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. శేఖర్ కమ్ముల రెమ్యునరేషన్ ఒకింత పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. శేఖర్ కమ్ముల గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి. ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు నిర్మాతాలకు సైతం మంచి లాభాలను అందించడం గమనార్హం.
కుభేర సినిమాలో మాస్ అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. కుబేర సినిమా పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో విడుదల కానుండగా ఇతర భాషల్లో సైతం ఈ సినిమా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కుబేర సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ, కథనంలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని భోగట్టా. ఈ సినిమా కోసం నాగార్జున రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది,. కెరీర్ విషయంలో నాగార్జున ఆచితూచి అడుగులేస్తున్నారు.