
మజాకా సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. శివరాత్రి పండుగ దృష్టిలో పెట్టుకొని ఈనెల 26వ తేదీన గ్రాండ్గా మజాకా సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ లో కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఉన్నట్టు కనిపిస్తోంది.. మొదట నీలాంటి కొడుకు భూమండలం మీద వెతికినా కూడా ఎక్కడా దొరకరు అనే చెప్పే డైలాగ్ తో మజాకా ట్రైలర్ రావు రమేష్ తో మొదలవుతుంది.
మరొకసారి తన కామెడీకి పంచు డైలాగులతో సందీప్ కిషన్ కూడా బాగానే ఆకట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. అలాగే రావు రమేష్, సందీప్ కిషన్ మధ్య వచ్చే తండ్రీ కొడుకుల సన్నివేశాలు కూడా హైలెట్గా నిలుస్తున్నాయి. చివరిలో హైపర్ ఆది కామెడీతో కూడా అదరగొట్టేసేలా కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఇది బాలయ్య బాబు ప్రసాదము కళ్ళకు అద్దుకొని తాగాలి అంటూ హైపర్ ఆది సందీప్ కిషన్ కి చెబుతూ జై బాలయ్య ,జై బాలయ్య అనాలి అంటూ ట్రైలర్లో చూపించారు. ఇలా మొత్తానికి విడుదలకు ముందే ట్రైలర్ తోనే మజాకా అనిపిస్తున్న సందీప్ కిషన్ సినిమా ఖచ్చితంగా హిట్టు కొట్టేలా ఉన్నారని అభిమానులు వెల్లడిస్తున్నారు. మరి ఏ విధంగా సందీప్ కిషన్ సక్సెస్ అందుకుంటారో చూడాలి.