ప్రజెంట్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ముందు ప్రభాస్ సినిమాలు వస్తున్నాయింటే అంచనాలు ఊహించని రేంజ్ లో ఉంటున్నాయి .. సలార్ , కల్కి సినిమాతో వరుసగా 1000 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టిన ప్రభాస్ .. ఇప్పుడు తన ఫోకస్ మొత్తం స్పిరిట్ సినిమాపై పెట్టాడు . హిట్ ప్లాప్‌లు పక్కన పెడితే సినిమా ఎంటర్టైన్ చేస్తే చాలు అని ఫ్యాన్స్ అనుకుంటే స్పిరిట్ మాత్రం మ‌రో లెవెల్ లో ఉంటుందని చెప్పక తప్పడం లేదు .. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్డేట్ ఊహించిన రేంజ్ లో ఉంటుంది.


ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది ? ప్రభాస్ లుక్ ఎలా ఉంటుంది ? అన్న క్వశ్చన్స్ అభిమానుల్లో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఉంటున్నాయి .. అలాగే వంగా అంటే మాస్ ఎమోషన్స్ , వైల్డ్ స్క్రీన్ ప్రెజెన్స్ , బ్రుటల్ యాక్షన్ కచ్చితంగా ఉంటుంది .. అర్జున్ రెడ్డి , య‌నిమల్ సినిమాల్లో హీరో పాత్రని ఎలా డిజైన్ చేశాడో అందరికీ తెలిసిందే .. ఇప్పుడు అదే స్టైల్ లో మరింత హై లెవెల్ ఎలివేషన్ తో ప్రభాస్ ను చూపించబోతున్నాడట. ఇక ప్రభాస్ ఈ సినిమాలో యాంగ్రీ పోలీస్‌ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని టాక్ ఉంది .. కానీ ఇది కచ్చితంగా మామూలు పోలీస్ స్టోరీ కాదని అండర్‌ వరల్డ్ గ్యాంగులను పట్టుకుని నేలమట్టం చేసే పవర్ఫుల్ లీడ‌ర్ పాత్ర ని కూడా తెలుస్తుంది ..


అందుకే ప్రభాస్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడట .. స‌లార్ లాంటి మాస్ లుక్ కాదు మరింత స్టైలిష్ .. రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా చూపించడానికి వంగ ఈసారి కొత్తగా డిజైన్ చేశాడని ఫీలింగ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. ఇక రాజాసాబ్ , ఫౌజి సినిమాలు కంటే స్పిరిట్ సినిమా పైనే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది .. వాటితో పోలిస్తే  స్పిరిట్‌కి బడ్జెట్ కూడా ఎంతో ఎక్కువ .. భూషణ్ కుమార్ నిర్మాణంలో ఈ సినిమా పాన్ వరల్డ్ రిలీజ్ గా ప్లాన్ చేస్తున్నారు .  అలాగే ఈ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ ప్రత్యేకంగా ప్రభాస్ తో ఫిజిక్స్ విషయంలో క్లోజ్ గా వర్క్ చేస్తున్నాడట .. అలాగే ఈ సినిమా రిలీజ్ విషయానికి వస్తే స్పిరిట్ 2026 సమ్మర్ కి థియేటర్లో రాబోతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: