ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యప్స్ ను ప్రమోట్ చేసే యూట్యూబర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పెద్ద యూట్యూబర్లు, చిన్న యూట్యూబర్లు అనే తేడాల్లేకుండా అందరు యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన లోకల్ బాయ్ నానిని పోలీసులు అరెస్ట్ చేయడం ఒకింత సంచలనం అవుతోంది. విశాఖ పోలీసులు లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు.
 
బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువమంది నష్టపోతున్న నేపథ్యంలో ఈ యాప్స్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకల్ బాయ్ నాని అరెస్ట్ తో ఇకపై యూట్యూబర్లలో ఏమైనా మార్పు వస్తుందేమో చూడాల్సి ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే లోకల్ బాయ్ నానిని వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఉంటే బాగుండేది.
 
బెట్టింగ్ యాప్స్ గురించి పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం వల్లే ఆయన వాటిని ప్రమోట్ చేశాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లోకల్ బాయ్ నాని ఈ కేసు నుంచి విడుదలవుతాడో లేదో చూడాల్సి ఉంది. తప్పు చేసిన ఇతర యూట్యూబర్లను సైతం అరెస్ట్ చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్న సంగతి తెలిసిందే.
 
బెట్టింగ్ యాప్స్ విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం సరికొత్త నియమ నిబంధనలను అమలు చేయాల్సి ఉంది. పెద్దపెద్ద యూట్యూబ్ ఛానెళ్లు సైతం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తుండటం గమనార్హం. బెట్టింగ్ యాప్స్ ఎన్నో కుటుంబాలను నాశనం చేయడంతో పాటు కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణం అవుతుండటం గమనార్హం. బెట్టింగ్ యాప్స్ ను కంప్లీట్ గా బ్యాన్ చేస్తే బాగుంటుందనే కామెంట్లు సైతం సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేస్తాయేమో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: