
హిందీ తో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సత్తా చూపిస్తూ శుక్రవారం నుంచి ఆదివారం వరకు భారీ కలెక్షన్ రాబట్టింది .. ముఖ్యంగా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాకపోయినప్పటికీ ఇక్కడ కూడా చాలా మంచి డిమాండ్ ఏర్పడింది .. అయితే సోషల్ మీడియాలో సిని ప్రేమికులు మరో ఆసక్తికరమైన పాయింట్ను చర్చిస్తున్నారు .. ఇటీవల టాలీవుడ్ లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ పైనే ఆధారపడుతుండగా .. ఛావా మాత్రం సింపుల్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే పర్ఫామెన్స్ తోనే విజయం అందుకుంది.
ఎలాంటి హై ఫై విజువల్స్ లేకుండా కేవలం కథే సినిమాను ముందుకు తీసుకువెళ్లింది .. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా చివరి 40 నిమిషాలు ప్రేక్షకులను ఎంతగానో కదిలించింది .. ఎమోషనల్ హై పాయింట్ కి తీసుకువెళ్లింది .. ప్రతి సన్నివేశం సజీవంగా అనిపించేలా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ హ్యాండిల్ చేశారు .. ఇక ఛావా తెలుగులో రిలీజ్ అయితే కూడా ఇక్కడి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ ఏమిటంటే తెలుగు నిర్మాతలు కూడా కంటెంట్ బలంపై ఆధారపడి సినిమాలు చేయాలని పాయింట్ .. అన్ని కోణాల్లో ప్రేక్షకులను టార్గెట్ చేయాలంటే కథే కీలకమని ఛావా ప్రూవ్ చేసింది .. మరి ఈ సినిమా మన తెలుగులో కూడా డబ్బింగ్ అవుతుందా ? లేక హిందులోనే కంటిన్యూ చేస్తారా ? అనేది మాత్రం వేచి చూడాలి.