మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి 60 సంవత్సరాల లోకే అడుగు పెట్టి కూడా చాలా కాలమే అవుతుంది. ఇక చిరంజీవి 60 సంవత్సరాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా వరుస పెట్టి కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా యూత్ పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు. దానితో చిరంజీవి పక్కన యంగ్ బ్యూటీస్ హీరోయిన్గా కనిపించడం , వారితో చిరు డాన్సులు వేయడం చేస్తూ వస్తున్నాడు. ఇదంతా బాగానే ఉంది. అలాంటి సినిమాలుకు కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి.

కానీ కొంత మంది ఆడియన్స్ మాత్రం చిరంజీవి వయసు పెరిగిపోయింది. ఆయన హీరోయిన్స్ తో డాన్స్ వేయడం , వారితో ప్రేమ సన్నివేశాలలో నటించడం చూస్తే కాస్త కష్టంగా ఉంటుంది. ఆయన తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తే అద్భుతంగా ఉంటుంది. అలా చిరు తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తే అలాంటి సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇకపోతే చిరంజీవి తాజాగా అలాంటి ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి , శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఈ మూవీ లో చిరు ఒక మధ్య వయస్సు కలిగిన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయనకు జోడిగా హిందీ సినీ పరిశ్రమలో సీనియర్ నటి అయినటువంటి రాణి ముఖర్జీని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అన్ని ఓకే అయితే చిరు , శ్రీకాంత్ కాంబోలో రూపొందబోయే సినిమాలో రాణి ముఖర్జీ హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: