ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమా పరిశ్రమ నుండి భారీ సినిమాలు పెద్దగా విడుదల కాకపోయినా మీడియం రేంజ్ సినిమాలు , చిన్న సినిమాలు మాత్రం చాలానే విడుదల అయ్యాయి. వాటిలో మీడియం రేంజ్ మూవీ గా విడుదల అయిన తండెల్ మూవీ కి మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక తాజాగా చిన్న సినిమాలు గా బాపు , రామం రాఘవం అనే సినిమాలు విడుదల అయ్యాయి. ఇక ఈ మూవీల విడుదలకు ముందు ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు బాగుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ లకు పర్వాలేదు అనే స్థాయిలో టాక్ వచ్చింది. దానితో తండెల్ , బాపు , రామం రాఘవం సినిమాలు కొన్ని రోజుల పాటు మంచి కలెక్షన్లను వసూలు చేస్తాయి అని చాలా మంది భావించారు. కానీ అనూహ్యంగా ఈ మూడు సినిమాలకు ఇతర భాష సినిమాల ద్వారా భారీ ఎదురు దెబ్బ తగిలినట్లే కనిపిస్తుంది. అది ఎలా అంటే ... తాజాగా హిందీ సినిమా అయినటువంటి చావా మూవీ ని హిందీ భాషలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. అలాగే తాజాగా తమిళ సినిమాలు అయినటువంటి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ , జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు.

ఇందులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ రాగా , జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాకు మంచి టాక్ వచ్చింది. దానితో తెలుగు సినిమాల కంటే కూడా ఇతర భాష సినిమాలకే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్షన్లు దక్కుతున్నట్లు , దానితో తండెల్ బాపు , రామం రాఘవం సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కలెక్షన్లు వచ్చే అవకాశాలు కనబడడం లేదు అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: