కోలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా , దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ధనుష్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని నటుడిగా అద్భుతమైన గుర్తింపును కోలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలు సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.

ఇప్పటికే ఈయన నేరుగా తెలుగులో కూడా ఓ సినిమాలో నటించాడు. ఓ సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నాడు. కొంత కాలం క్రితం ఈయన సార్ అనే తెలుగు సినిమాలో నటించి మంచి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం కుబేర అనే తెలుగు సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇలా నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ధనుష్ ఇప్పటి వరకు మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ మూడు మూవీలతో కూడా ఆయన మంచి విజయాలను అందుకున్నాడు. కేవలం ఆయన దర్శకత్వం వహించిన మూడు సినిమాలతో మంచి విజయాలను అందుకోవడం మాత్రమే కాకుండా ఈయన తాను దర్శకత్వం వహించిన మూడు సినిమాలను మూడు జోనర్ లలో రూపొందించాడు. ధనుష్ కొంత కాలం క్రితం ప పాండి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ని ఎమోషనల్ డ్రామా మూవీ గా రూపొందించాడు. ఇక కొంత కాలం క్రితం ధనుష్ "రాయల్" అనే సినిమాలో హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు.

మూవీ ని యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించి ధనుష్ సక్సెస్ అయ్యాడు. ఇక తాజాగా ధనుష్ "నిలవకు ఎన్ మెల్ కోబం" అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ తాజాగా విడుదల అయింది. ఈ సినిమాకు కూడా మంచి టాక్ వచ్చింది. ఇలా ఇప్పటి వరకు ధనుష్ మూడు డిఫరెంట్ జోనర్ మూవీలను రూపొందించి మూడింటితో కూడా మంచి విజయాలను అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: