
2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది .. ఆ తర్వాత చిరు దసరా దర్శకుడుశ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నారు .. ఇప్పటికే ఈ ప్రాజెక్టు గురించి అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది .. హీరో నాని తో కలిసి సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తారు .. . 2026 లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అని.. నిన్న ‘కోర్ట్’ సినిమా ఈవెంట్లో భాగంగా నాని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే . అయితే ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది .
అసలు విషయం ఏమిటంటే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమా పూర్తిగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట .. చిరంజీవి ఈ తరహా కథ గతంలో ఎప్పుడు చేయలేదని కూడా అంటున్నారు .. విక్రం లో కమలహాసన్ జైలర్లో రజిని మాదిరి .. వయసు మీద పడ్డ వ్యక్తిగా ఇందులో చిరంజీవి కనిపిస్తారని అంటున్నారు .. అలాగే చిరంజీవికి జంటగా ఓ సీనియర్ హీరోయిన్ను తీసుకోబోతున్నారని తెలుస్తుంది .. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీని అందుకోసం సంప్రదించినట్లు టాక్ వినిపిస్తుంది .. అయితే ఇదే నిజమైతే కనుక రాణి ముఖర్జీ తెలుగులో చేయబోయే మొదటి సినిమా కూడా ఇదే అవుతుంది.