
చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి చూపించిన ప్రియాంక చదువు పూర్తయిన వెంటనే మోడలింగ్ వైపు అడుగులు వేసింది .. అలాగే 2000 సంవత్సరంలో మీస్ వరల్డ్ కిరీటాన్ని కూడా గెలుచుకోవడంతో ప్రియాంక చోప్రా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది .. అలాగే మిస్ వరల్డ్ గా గెలవడంతో ఆమెకు బాలీవుడ్ లో కూడా భారీ అవకాశాలు వచ్చాయి .. తమిళంలో వచ్చిన తమిళన్ ద్వారా సినీ ప్రస్థానం మొదలుపెట్టినప్పటికీ బాలీవుడ్ లోనే ప్రియాంక మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలకు జంటగా నటించి భారీ పాపులారటి అందుకున్న ప్రియాంక .. బాలీవుడ్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్న తర్వాత హాలీవుడ్ వైపు అడుగులు వేసింది .. ఇదే క్రమంలో వయసులో తనకన్నా చిన్నవాడైన హాలీవుడ్ స్టార్ సింగర్ నిక్ జోనాస్‌తో ప్రేమలో పడటం అతని పెళ్లి చేసుకోవడం జరిగింది .. ఈ జంటకు మలతీ మారియా చోప్రా జోనాస్ అనే పాప కూడా ఉంది.
అయితే ప్రస్తుతం ప్రియాంక , మహేష్ - రాజమౌళితో చేస్తున్న సినిమాలో భారీ నెగటివ్ పాత్రలో నటించబోతుంది .. అయితే ఇప్పుడు తాజాగా ఈ బ్యూటీ మహిళల కన్నత్వం గురించి భారీ షాకింగ్ కామెంట్లు చేసింది .. అలాగే చాలామంది అబ్బాయిలు తమకు వచ్చే భార్యలు వర్జీన్‌గా రావాలని కోరుకుంటారు .. కానీ వర్జిన్ అనేది అంత ముఖ్యమైన పని విషయం కాదు .. అలాగే వర్జినిటీ అనేది ఒక రాత్రిలో పోతుంది .. దానికోసం పెద్దగా పట్టించుకుని బాధపడాల్సిన అవసరం లేదని కూడా చెప్పుకొచ్చింది .. మనకు నచ్చిన విధంగా ఉండే మహిళ మన జీవిత భాగస్వామిగా రావాలని కోరుకోవాలని ప్రియంక చోప్రా ట్వీట్ చేసింది .. అయితే ప్రస్తుతం ప్రియాంక చేసిన వ్యాఖ్యలకు కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు ఆమె వ్యాఖ్యలకు భారీ కౌంటర్లు ఇస్తున్నారు.