
అలగే ఈ సినిమాకి భారీ ఓపెనింగ్ తీసుకురావడానికి సూపర్ స్టార్ క్రేజ్ ఎంత హెల్ప్ అయిందో ఈ సాంగ్ కూడా అంతే ప్లస్ అయింది. ఆ తర్వాత రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే పాటలు సంగతి ఏంటని ఆరా తీశారు ప్రేక్షకులు ఆ విషయాన్ని అర్థం చేసుకున్న మేకర్స్ .. మనసిలాయో అంటూ మంజు వారియర్‌తో స్పెషల్ సాంగ్ ని డిజైన్ చేశారు . ఇక ఇప్పుడు రజనీకాంత్ కూలీలో ఏ సాంగ్ ప్లాన్ చేశారా ? అని ఆసక్తి అందరిలో మొదలైంది .. సూపర్ స్టార్ కోసం లోకేష్ కనకరాజ్ స్పెషల్ గా ఎవరినైనా తీసుకొస్తారా ? లేకపోతే ఇప్పటికే సినిమాలో ఉన్న శృతిహాసన్ తో పాటను కానిచ్చేస్తారా అనే డిస్కషన్ కూడా మొదలైంది.
అయితే నాని హాయ్ నాన్న సినిమాలో శృతి స్టెప్పులు అంత ఈజీగా మర్చిపోలేదు జనాలు .. అయితే ఇప్పుడు కూలీలో శృతి రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట .. అందుకే సాంగ్ విషయంలో ఆమెను ఇన్వాల్వ్ చేయడం లేదు దర్శకుడు లోకేష్ . అయితే కూలి సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం పూజ హెగ్డే కి అవకాశం ఇస్తున్నారు చిత్ర యూనిట్ .. సూపర్ స్టార్ సినిమాలో జిగేల్ రాణి జిల్ జిల్ జిగేల్‌మనిపించే బాధ్యత తీసుకోబోతుంది .. ఇప్పుడు ఇదే వార్త సూపర్ స్టార్ అభిమానులు ఖుషి చేస్తుంది.