
కింగ్డమ్ టీజర్ అంతలా ప్రేక్షకులను మెప్పించింది .. అలాగే కథ లో భారీగా డెప్త్ ఉంది .. అలాగే కాన్ఫిడెంట్ గా థియేటర్లో ఎంట్రీ ఇచ్చేయొచ్చనే టాక్ కూడా వచ్చేసింది . మే 30 న ప్రేక్షకులు ముందుకు కింగ్‌డమ్ సినిమా రాబోతుంది . సిక్స్ ప్యాక్ లో విజయ్ లుక్ ఎప్పటి కే వైరల్ అవుతోంది . పాన్ ఇండియా రేంజ్ లో కింగ్‌డమ్ మీద భారీ అంచనాలు క్రియేట్ అయింది .. గౌతం తిన్నూరి , రౌడీ హీరోని ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది . ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ , సాయి సౌజన్య ఈ సినిమా ను నిర్మిస్తున్నారు .. అలాగే భాగ్యశ్రీ బోర్సే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది .. సత్యదేవ్ కీలక పాత్ర లో నటిస్తున్నారు .. మరి ఈ సినిమా తో విజయ్ దేవరకొండ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి .