దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మహేష్ బాబు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని జక్కన్న ఆలోచనలో ఉన్నారట. ఎస్ఎస్ఎంబి  29 సినిమాను అమెజాన్ అడవుల నేపథ్యంలో తీస్తున్నారు. 

కాగా ఎస్ఎస్ఎంబి 29 సినిమాను 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమా పూర్తయ్యే లోపు ఈ బడ్జెట్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఎస్ఎస్ఎంబి 29 సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేసే పనిలో చిత్ర బృందం ఉన్నారట.


తంలో మహారాజు, గరుడ వంటి అనేక రకాల టైటిల్స్ వినిపించినప్పటికీ ఇందులో ఏది కూడా ఫైనల్ కాలేకపోవడం ఆసక్తిని కలిగిస్తోంది. సినిమా గురించి అనౌన్స్మెంట్ ఇవ్వటం లేదేమో అన్న డౌట్లు కూడా వినబడుతున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ చేస్తూనే టైటిల్ ఖరారు చేసే పనిలో జక్కన్న టీం అంతా ఉన్నారట. ఒకసారి టైటిల్ కనుక ఫిక్స్ అయినట్లయితే గ్రాండ్ గా ఈ విషయాన్ని అనౌన్స్మెంట్ చేయాలని అనుకుంటున్నారట. అంతేకాకుండా అనౌన్స్మెంట్ టీజర్ ను రిలీజ్ చేయాలని కూడా చిత్ర బృందం భావిస్తోంది.


అంతేకాదు ఆ టీజర్ తో పాటు కాస్టింగ్ విషయంలోనూ ఫుల్ క్లారిటీ ఇచ్చే విధంగా బిగ్ స్కెచ్ జక్కన్న రెడీ చేస్తున్నారట. ఇక ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా రిలీజ్ అవ్వడానికి కాస్త ఆలస్యమైనప్పటికీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: