
మొత్తంగా ఈ సినిమా కథ పూర్తయిన వెంటనే ఈ సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ ఫైనల్ చేసినట్లుగా వెల్లడించారు. ఈ సినిమాలో హీరోగా గతంలో నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు నాని కాకుండా నితిన్ హీరోగా చేస్తున్నారట. నితిన్ సరసన హీరోయిన్ గా సాయి పల్లవి నటించబోతోంది. ఇప్పటికే ఎంతో సాంప్రదాయంగా కనిపించే సాయి పల్లవి మరో సినిమాతో అభిమానుల ముందుకు రానుంది.
ఇప్పటివరకు తాను నటించిన సినిమాలన్నింటిలో సాయి పల్లవి చాలా సాంప్రదాయంగా నటిస్తూ ఉంటుంది. సాయి పల్లవి నటించిన మొదటి సినిమా ఫిదాలో ఈ అమ్మడు తెలంగాణ అమ్మాయిగా చాలా నేచురల్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి సాయి పల్లవిని అలాంటి పాత్రలలో చూడడానికి అభిమానులు ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని సమాచారం అందుతుంది.
చివరిగా సాయి పల్లవి హీరో శివ కార్తికేయన్ తో కలిసి అమరన్ అనే సినిమాలో నటించింది. సాయి పల్లవి వరుసగా సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పుడు తెలుగు ప్రాజెక్టు అయిన ఎల్లమ్మ సినిమాకు ఓకే చెప్పడంతో అభిమానులు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అంతేకాకుండా సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తుంది కాబట్టి ఎల్లమ్మ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.