
అయితే స్టార్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా కూడా డాకూ మహారాజ్ సినిమాలో కేవలం ఐటం సాంగ్ లో కనిపించడమే కాకుండా కొన్ని సన్నివేశాలలో కూడా నటించింది. అయినప్పటికీ ఈమె సినిమాకి సంబంధించిన ప్రతి ఈవెంట్ కి హాజరయ్యింది. సినిమా కోసం ఈమె చాలా కష్టపడినప్పటికి కూడా తాను నటించిన సీన్ లు ఓటీటీలో కనిపించవని టాక్ వినిపించింది. దీంతో ఈ ప్రచారంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలోని ప్రతి ఈవెంట్ లో ముందున్న ఆమెకి ఎందుకని ఇంత అన్యాయం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. అయితే ఈ ప్రచారం అబద్దామని.. అన్నీ సన్నివేశాలు యథాతథంగా ఉంటాయని తెలిపారు. ఇక ఓటీటీలో కూడా ఊర్వశిని చూడవచ్చు.
ఇదిలా ఉండగా.. బాలయ్య బాబు ఫాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక బాలయ్య బాబు ఈ సినిమా తర్వాత అఖండ 2: తాండవం సినిమా కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందే. అఖండ 2: తాండవం సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మరో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతుంది. అయితే ఈ సినిమాను తెరకెక్కించేందుకు షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.