టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి హీరోయిన్లలో రీతు వర్మ ఒకరు. ఈ బ్యూటీ తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా, గత కొంత కాలం నుంచి ఈ చిన్నది పెద్దగా సినిమా అవకాశాలు లేక అభిమానులకు కాస్త దూరంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో తన సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వచ్చింది. ఈ బ్యూటీ నటించిన తాజా చిత్రం మజాకా.


ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించింది. కాగా, ఈ క్రమంలోనే మజాకా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో రీతు వర్మ మాట్లాడుతూ కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. ముద్దు సీన్స్ సినిమాలలో నాకు ఇప్పటివరకు అవకాశం రాలేదు. కథ డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాలలో నటించడానికి నేను ఏమాత్రం వెనకడుగు వేయను అని రీతు వర్మ అన్నారు. ఈ అమ్మాయి ఇలాంటి పాత్రలు చేయదని కొంతమంది నిర్ణయాలు తీసుకున్నారు.


ఆ కారణంతోనే నా వద్దకు అలాంటి కథలు రావడం లేదు కావచ్చు అని రీతు వర్మ హాట్ కామెంట్స్ చేశారు. కాగా, ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఇందులో రావు రమేష్ కీలకపాత్రను పోషించారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో తండ్రి, కొడుకులు ఇద్దరిద్దరూ అమ్మాయిలను ప్రేమిస్తే వారి ప్రేమ, పెళ్లి ఫుల్ లెంగ్త్ కామెడీగా ఈ సినిమా ఉండబోతున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది.


ఏకే ఎంటర్టైన్మెంట్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాకి స్టార్ రైటర్ ప్రసన్న బెజవాడ సినిమా కథ, మాటలు అందిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మజాకా సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: