ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 హిట్ కొట్టి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ గంగో రేణుకతల్లి పాటలో వేసిన అమ్మవారి గెటప్ కి మాత్రం ఫాన్స్ పెరిగిపోయారు.. ఆ పాటలో ఆయన యాక్టింగ్ కి ప్రశంసల వర్షం కురిసింది. అయితే ఈ పాటలో అల్లు అర్జున్ చీర కట్టుకొని మరి డాన్స్ చేశారు. ఈ పాటతో ఆయన పాన్ ఇండియా మొత్తం మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. అయితే అల్లు అర్జున్ ని చీర కట్టుకోమన్నప్పుడు ఆయన ఫస్ట్ రియాక్షన్ గురించి బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దర్శకుడు నన్ను చీర కట్టుకోవాలి అన్నప్పుడు నేను భయపడ్డాను. షూటింగ్ లో కూడా మొదట భయపడ్డాను. కానీ తర్వాత ఒకే అనిపించింది. ఇలాంటిది నటుడికి ఒక ఛాలెంజ్ లాంటిది. కానీ ఆ పాత్ర చేసినప్పుడే గొప్ప పేరు వస్తుందని నమ్మను' అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు.
 
 ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ మరో అరుదైన రికార్డు సాధించారు. పుష్ప సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ లోనే కాదు..  హాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రముఖ సినిమా మ్యాగజైన్ ''ది హాలీవుడ్ రిపోర్టర్'' ఇప్పుడు ''ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'' పేరుతో భారత్ లో కూడా అడుగుపెట్టేసింది. ఆ మ్యాగజైన్ తొలి సంచికలో అల్లు అర్జున్ ఫోటో రానుంది.

 
ఐకన్ హీరో అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తీసిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటించింది. అయితే ఇప్పటికే పార్ట్ వన్ హిట్ కొట్టడంతో ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమాను తీశారు. ఇకపోతే పుష్ప 2  మూవీ యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ ఇచ్చింది. అలాగే స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అన్నీ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయని అభిమానులు తెలిపారు. ఇప్పటివరకు ఈ సినిమా రూ. 1,871 కోట్లు వసూలు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: