
హీరో మోహన్ లాల్ కథ చెప్పక.. తన పాత్ర గురించి చాలా సందేహాలు అడుగుతారని అనుకుని దర్శకులు వెళ్తారట. కానీ కథ పూర్తి అవ్వగానే షూటింగ్ కి ఎన్ని రోజులు పడుతుందని మాత్రమే అడుగుతారు. ఎందుకంటే మోహన్ లాల్ కి సినిమాపై చాలా అవగాహన ఉంది. అలాగే ఆయన దర్శకులపై చాలా నమ్మకం ఉంచుతారు. ఇక.. మెగాస్టార్ చిరంజీవి నటనను పొగడని వారుండారు. టాలీవుడ్ మొత్తానికి ఆయనే హీరో. మెగాస్టార్ సినిమాలు అంటే చాలు ఫ్యాన్స్ పరుగులు పెడతారు. రెండు తెలుగు రాష్ట్రాలలో మెగ స్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ ఏ హీరోకి లేదు.
అయితే వీరిద్దరూ ఇప్పటికే 100కు పైగా సినిమాలలో నటించి ఉంటారు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు మోహన్ లాల్, చిరంజీవి జెట్ స్పీడ్ లో 100 సినిమాలు పూర్తి చేసిన మరింత క్రేజ్ సొంతంచేసుకున్నారు. వీరితో పాటుగా మరికొందరు హీరోలు కూడా అతి తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలలో నటించారు. మరి ఆ ఇతర స్టార్ హీరోలు ఎవరో, వారు ఎంత సమయంలో 100 సినిమాలను పూర్తి చేశారో తెలుసుకుందాం. మోహల్ లాల్ 11 ఏళ్లలో 100 సినిమాలు చేస్తే.. చిరంజీవి 10 ఏళ్లలో 100 సినిమాలలో నటించారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ అయితే కేవలం 8 ఏళ్లలోనే వంద సినిమాలను చేశారు.