ఇకపోతే సురేఖా తెలుగు సినీ నటి. ఈమె తెలుగుతో పాటుగా తమిళ సినిమాలలో కూడా నటించింది. దాదాపు 45 పైగా సినిమాలలో ఈమె సహాయ పాత్రలలో నటించింది. ఈమె మొదట ఓ ప్రాంతీయ ఛానల్లో ఒక పిల్లల కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆతర్వాత పెళ్లి చేసుకుని.. తన భర్తతో కలిసి మా టాకీస్, హార్ట్ బీట్ అనే కార్యక్రమాలలో కూడా యాంకర్ గా పనిచేసింది. ఇలా సురేఖా తన అందం, ప్రతిభతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ.. ప్రేక్షకుల మనసును దోచుకుంది. అనంతరం సురేఖా మంచి హిట్ మూవీస్ లో మంచి మంచి పాత్రలను పోషించింది. రవితేజ నటించిన భద్ర, దుబాయ్ శీను, నిప్పు సినిమాలలో నటించింది. రామ్ నటించిన రౌడీ, గణేష్ సినిమాలు.. సిద్దార్థ్ నటించిన బొమ్మరిల్లు, ఓయ్ సినిమాలలో.. వెంకటేష్ నటించిన నమో వెంకటేశ సినిమా, ఇక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నాయక్, శ్రీమంతుడు, బాద్ షా లాంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలలో మంచి పాత్రలలో కనిపించింది.