
ఈ చిత్రంలో శివ కందుకూరి ప్రధాన పాత్రల నటిస్తూ ఉన్నారు. తాజాగా బూమరాంగ్ గ్లింప్స్ రిలీజ్ చేయగా అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది.అను ఇమ్మాన్యుయేల్ ఒక బిల్డింగ్ లోకి వెళ్లడం అక్కడ ఎవరో ఉన్నారని తాను అనుకోవడంతో పాటు ఆ బిల్డింగులో చాలామంది గుర్తు తెలియని వ్యక్తులు చంపుతూ ఉన్నట్టుగా చూపించారు. ఆ ఇంట్లోనే అను ఉన్నట్టుగా చూపించారు. చూడడానికి గ్లింప్స్ చాలా భయంకరంగా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి ఇచ్చినటువంటి బిజిఎం హైలైట్ గా నిలుస్తోంది.
ఈ చిత్రాన్ని ఆండ్రివ్ బాబు డైరెక్షన్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో అను ఇమ్మాన్యుయేల్ నటిస్తూ ఉన్నది. బూమరాంగ్ సినిమా మరి ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి. అను కెరియర్ విషయానికి వస్తే మొదటిసారి హీరో నాని నటించిన మజ్ను అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాలను గ్లామర్ రోజు ఉన్న పాత్రలలో నటించినప్పటికీ ఏ సినిమాలు కూడా సక్సెస్ కాలేకపోయాయి. చివరిగా అల్లు శిరీష్ తో ఊర్వశివో రాక్షసివో వంటి సినిమాలో నటించింది. బూమరాంగ్ సినిమా రిలీజ్ డేట్ ని మాత్రం ఇంకా ప్రకటించలేదు.