
అయితే డ్రాగన్ సినిమాలో నటిస్తున్న కయాడు లోహర్ ఇంతకుముందే అల్లూరి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కానీ ఆ సినిమా మంచి టాక్ ని సొంత చేసుకోక.. ఈమెకి కూడా మంచి గుర్తింపు రాలేదు. ఇదిలా ఉండగా.. ఈ హీరోయిన్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలవాలని కోరుకుంటుంది. పాపులర్ అవ్వాలని తన మీద తానే మీమ్స్ క్రియేట్ చేసుకుంటుంది. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ బ్యూటీ మీమ్ రివీల్ అయింది. అయితే ఆ ఈవెంట్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూల్ ఈమె గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ సందర్భంగా కయాడు లోహర్, ప్రదీప్ రంగనాథ్, దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఇంటర్వ్యూలో సినిమా సంగతులను పంచుకున్నారు. అయితే ఈ క్రమంలో లోహార్, ప్రదీప్ కి లవ్ టుడే మూవీలోని ఫోన్లు మార్చుకునే సీన్ చేయమని అడిగారు. దాంతో మొబైల్ లను మార్చుకున్నారు. అప్పుడు హీరో ప్రదీప్ రంగనాథ్, లోహార్ ఫోన్ లో మీమ్ క్రియేట్ చేసుకునే ఒక యాప్ ఉందని చెప్పుకొచ్చాడు. అలాగే తనపై తానే మీమ్ క్రియేట్ చేసుకుందని చెప్పాడు. అందులో తెలుగు సినిమాలో నెక్స్ట్ టాప్ హీరోయిన్ అంటూ కయాడు లోహర్ తన ఫోటోతో చేసుకున్న మీమ్ కూడా ఉన్నట్లు ప్రదీప్ స్పష్టం చేశారు. ఇక ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన ప్రేక్షకులు లోహార్ శకలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.