
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత ఈ పెళ్లి కోసం దుబాయ్ కి వెళ్లారు. అక్కడ నమ్రత, ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి కలిసి ఓ గ్యాంగ్ తో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ ఫోటోలలో ఎన్టీఆర్ చాలా స్లిమ్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అయితే తన తదుపరి సినిమా కోసమే ఎన్టీఆర్ తన పూర్తి లుక్ ని మార్చేసినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్ రీసెంట్ గా నటించిన దేవర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటించింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా మారిపోయింది. కొద్దిరోజుల తర్వాత దేవర సినిమాకు సీక్వెల్ గా దేవర-2 సినిమా కూడా తీయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్-2 సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా అభిమానుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.