
అయితే నాగచైతన్య తర్వాత సినిమాల ను ఏ డైరెక్టర్ తో కమిట్ అవుతున్నాడు అని ఇంట్రెస్టింగ్గా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇదే మూమెంట్లో నాగచైతన్య ఒక స్టార్ హీరో అవ్వాల్సిన వ్యక్తిని జీరోగా మార్చేసాడు అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు . ఆయన మరెవరో కాదు వరుణ్ సందేశ్ . "హ్యాపీడేస్" సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమంలోకి ఇంట్రడ్యూస్ అయిన వరుణ్ సందేశ్ ఎంత మంచి టాలెంటెడ్ ఉన్న నటుడు అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు .
కాగా వరుణ్ సందేశ్ నటించాల్సిన 100 % లవ్ సినిమాను రాత్రికి రాత్రి నాగార్జున ఆయన చేతుల్లో నుంచి నాగచైతన్య ఖాతాలో పడేలా చేశారట . ఈ విషయం అప్పట్లో సెన్ సేషనల్ గా మారింది. కొంతమంది పేరు పలుకుబడి ఉన్న వ్యక్తులు వరుణ్ సందేశ్ కు ఈ ఆఫర్ దక్కనికుండా నాగచైతన్య ఖాతాలో పడేలా చేశారట. అప్పట్లో జనాలు ఈ విషయం గురించి ఎక్కువుగా మాట్లాడుకున్నారు . అలా ఈ సినిమాను వరుణ్ సందేశ్ కి దక్కనికుండా నాగచైతన్య తన ఖాతాలో వేసుకున్నట్లయ్యింది . ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ ఇష్యూ కారణంగా నాగచైతన్య ని ట్రోల్ చేస్తూనే ఉంటారు జనాలు..!