రష్మిక మందన్నా.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ మారుమ్రోగిపోతున్న ఏకైక హీరోయిన్ పేరు . అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ పాన్ ఇండియా హీరోయిన్ అంటే మాత్రం ప్రతి ఒక్క డైరెక్టర్ కి ప్రతి ఒక్క హీరోకి గుర్తొచ్చేది రష్మిక మందన్నానే.  నేషనల్ క్రష్ గా తనకంటూ సపరేట్ ట్యాగ్ చేయించుకొని మరి ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . కాగా రష్మిక మందన్నా  తాజాగా నటించిన మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం ఇప్పుడు ఆమె క్రేజ్ వేరే లెవెల్ లో వెళ్లిపోయేలా చేసింది.


కాగా రష్మిక మందన్నా ఖాతాలో పడాల్సిన ఒక బిగ్ బడా ఆఫర్ ని ఇప్పుడు మరొక కన్నడ హీరోయిన్ తన ఖాతాలో వేసుకోవడం సెన్సేషనల్ గా మారిపోయింది . మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడు.  రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు జరిగాయి . ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది . అయితే నిజానికి ఈ సినిమాలో మొదటగా రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నారట మేకర్స్.



కానీ కొన్ని కొన్ని కండిషన్స్ పెట్టడం వల్ల రష్మికను ఈ ప్రాజెక్టు నుంచి తప్పిస్తూ రుక్మిణి వసంత్ ని ట్రాక్ లోకి రప్పించారట . రుక్మిణి వసంత్ - రష్మిక మందన్నా ఇద్దరు కన్నడ హీరోయిన్లే.  ఇద్దరు అక్కచెల్లెళ్లుగా మాట్లాడుకుంటూ ఉంటారు జనాలు.  అయితే ఇప్పుడు రష్మికకు పెద్ద బొక్క పెట్టింది ఈ చెల్లి కాని చెల్లి అంటూ కూడా జనాలు ట్రోల్ చేస్తున్నారు . తారక్ సినిమాలో నటించే ఛాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు . కేవలం రెమ్యూనరేషన్ కోసం అలాంటి ఒక ఛాన్స్ మిస్ చేసుకుంటే లైఫ్ లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని రష్మిక కి బాగా వార్న్ చేస్తున్నారు జనాలు . ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాబోలో రుక్మిణీ ఇక ఆమె కెరియర్ ఏ విధంగా మారిపోతుందో అంటూ మాట్లాడుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: