
తెలుగులో రాజమౌళి సుకుమార్ కాకుండా 1000 కోట్ల రాబట్టిన దర్శకుల లిస్టులో చోటు సంపాదించుకున్నాడు నాగ్ అశ్విన్ .. ప్రస్తుతం కల్కి 2 కి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక కల్కి అనేది ఒక భాగం కాదని ఇదో ఫ్రాంచైజీ అని ఇదివరకే చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్ .. అయితే అవన్నీ ఒకేసారి సిరీస్ లా చేయాలని లేదు .. సమయం దొరికినప్పుడల్లా చేస్తూ పోతానని కూడా చెప్పుకొచ్చారు .. అయితే ఇప్పుడు ఈ లెక్కన ప్రస్తుతం కల్కి2 తోనే నాగ్ అశ్విన్ బిజీగా ఉన్నారా లేదంటే మరో సినిమా కోసం ఏదైనా కథ రెడీ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి . ప్రభాస్ ప్రస్తుతం ఎంతో బిజీగా ఒకవైపు రాజా సబ్ చేస్తూనే మరోపక్క హను రాఘవపూడి సినిమా కోసం డేట్లు కూడా ఇచ్చేశారు .
వీటికి తోడు సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ సినిమా కూడా చేస్తున్నాడు . . ఈ మూడు సినిమాలు అయ్యాకే కల్కి 2 వైపుకు వస్తారు ప్రభాస్ .. ఈ సినిమాలన్నీ అవడానికి కనీసం రెండు సంవత్సరాలైనా పడుతుంది . అయితే ఈ లోపు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా కోసం నాగి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది .. మహానటి లాంటి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాతో చరిత్ర సృష్టించాడు నాగ్ అశ్విన్. ఇక ఇప్పుడు ఆలియాతో పాన్ ఇండియా సెన్సేషన్ చేయాలని చూస్తున్నాడు .. పైగా ఆలియా కూడా బాలీవుడ్ లో ఈ తరహా కథలు ఎక్కువగా చేస్తున్నారు .. ఇక ఇప్పుడు మొత్తానికి ఈ కాంబో కలిస్తే కొత్త ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది.