
కెరియర్ మొదట్లో నే ఈ ముద్దుగుమ్మ అగ్ర హీరోల కు జంట గా అవకాశాలు అందుకుంది . అలాగే కోట్ల మంది అభిమానులను ఈమె సొంతం చేసుకుంది .. ఏం మాయ చేసావే సినిమా తో సినీ కెరియర్ మొదలుపెట్టిన సమంత ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని అభిమానుల మనసులో చెరిగిపోని ముద్ర వేసుకుంది .. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , అత్తారింటికి దారేది , యశోద , ఓ బేబీ , జనతా గ్యారేజ్ వంటి సినిమాలో నటించి మెప్పించింది .
అయితే తాజా గా సమంత సోషల్ మీడియాలో తాను మాట్లాడిన వీడియోను షేర్ చేసింది .. అయితే అందులో చిత్ర పరిశ్రమ లో బెస్ట్ హీరోయిన్ ఎవరో చెప్పుకొచ్చింది .. అయితే అమరాన్ సినిమా లో సాయి పల్లవి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందని కూడా చెప్పుకొచ్చింది .. అలాగే నజ్రియ సూక్ష్మ దర్శినిలో , అలియా భట్ .. జిగ్రాలో అనన్య పాండే కంట్రోల్లో అద్భుతంగా నటించిందని సమంత ఈ వీడియో లో చెప్పుకొచ్చింది .. ఇలా ఇండస్ట్రీ లో బెస్ట్ హీరోయిన్స్ ఎవరు అనేదానికి సమంత ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చింది .. సమంత మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.