సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు, క్యారెక్టర్స్ అనేవి ఒక సినిమాలో ఒకలా మరో సినిమాలో మరోలా ఉంటాయి. ఓ సినిమాలో హీరోకి తల్లిగా చేసిన హీరోయిన్ నెక్స్ట్ సినిమాలో ఆయనతో రొమాన్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక సినిమాలో హీరోయిన్ కి తండ్రి పాత్రలో నటించిన నటుడు మరో సినిమాలో ఆ హీరోయిన్ కి భర్త లేదా ప్రియుడు పాత్రలో నటించాల్సి ఉంటుంది. అలా డైరెక్టర్ ఇచ్చిన పాత్రకి తగ్గట్టుగా నటీనటులు నటించాల్సి ఉంటుంది. అయితే అలాంటి ఒక విషయం గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓ హీరోయిన్ ఓ సినిమాలో తల్లిగా నటించి మరో సినిమాలో రొమాన్స్ చేసిందట.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే సీనియర్ నటి రమ్యకృష్ణ.. 

సీనియర్ హీరోయిన్లలో ఇప్పటికి కూడా చేతినిండా అవకాశాలు ఉన్న హీరోయిన్ ఎవరంటే ఎక్కువగా గుర్తుకు వచ్చేది రమ్యకృష్ణ మాత్రమే.బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణకు టాలీవుడ్ లో అవకాశాలు మరింతగా పెరిగిపోయాయి. అయితే అలాంటి రమ్యకృష్ణ మహేష్ బాబుకి ఓ సినిమాలో తల్లి పాత్రలో చేసి మరో సినిమాలో రొమాన్స్ చేసింది.ఇక తల్లి పాత్ర చేసిన సినిమా గుంటూరు కారం.. రమ్యకృష్ణ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో హీరో మహేష్ బాబు కి తల్లి పాత్రలో నటించింది.అలాగే మహేష్ బాబు హీరోగా నటించిన నాని మూవీలో ఆయనతో మార్కండేయ అనే ఐటెం సాంగ్ లో  చేసింది.రమ్యకృష్ణ మహేష్ బాబుల మధ్య ఓ హాట్ రొమాంటిక్ సాంగ్ ఉంటుంది.

అయితే ఈ ఐటెం సాంగ్ వచ్చాక కొన్ని అభ్యంతరాలు రావడంతో ఈ పాటను సినిమా నుండి తీసేసినప్పటికీ యూట్యూబ్ లో మాత్రం అందుబాటులో ఉంది.అలా ఓ సినిమాలో రొమాన్స్ చేసి మరో సినిమాలో మహేష్ బాబుకి తల్లి పాత్రలో నటించింది. అయితే రమ్యకృష్ణ కేవలం మహేష్ బాబుకి మాత్రమే కాకుండా ప్రభాస్,ఎన్టీఆర్ వంటి హీరోల సినిమాల్లో కూడా విభిన్న పాత్రల్లో నటించింది.ఎన్టీఆర్ నటించిన సింహాద్రి మూవీలో ఎన్టీఆర్ తో ఐటెం సాంగ్ చేసి ఆ తర్వాత నా అల్లుడు మూవీలో అత్త పాత్రలో నటించింది.అలాగే ప్రభాస్ నటించిన అడవి రాముడు మూవీలో ప్రభాస్ తో రమ్యకృష్ణ ఐటెం సాంగ్ చేసింది. కానీ బాహుబలిలో ఆయనకు తల్లి పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: