టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది హీరోయిన్లు మాత్రమే వారి నటన, అందంతో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో అనుష్క శెట్టి ఒకరు. ఈ బ్యూటీ సూపర్ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫెర్ అవార్డును అందుకుంది. ఆ సినిమా అనంతరం వరసగా సినిమా అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పింది. 

టాలీవుడ్ లో ఉన్న ప్రతి ఒక్క స్టార్ హీరో సరసన ఈ చిన్నది హీరోయిన్ గా చేసి ఎనలేని గుర్తింపు అందుకుంది. ఈ చిన్నదాని నటనకు ప్రతి ఒక్క సినీ అభిమాని తన సినిమాలను ఇష్టపడేవారు. కాగా, ఈ చిన్నది ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే ఈ బ్యూటీ హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిమణుల జాబితాలో అనుష్క ముందు వరుసలో ఉన్నారు. ఈ బ్యూటీ వయసు పెరిగినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది.


కొంతమంది హీరోలతో ఏఫైర్లు కొనసాగించినట్లు ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ అందులో అనుష్క ఎవరిని కూడా వివాహం చేసుకోకపోవడం గమనార్హం. కాగా, అనుష్క శెట్టి రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రేమలో ఉన్నట్లు ఎన్నో రకాల రూమర్స్ వచ్చినప్పటికీ ఇంతవరకు ఈ జంట వివాహం చేసుకోవడం లేదు. కాగా, అనుష్కకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అనుష్కతమిళ దర్శకుడితో ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారట.

ఈ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. త్వరలోనే అనుష్క మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నారట. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ అనుష్క నిజంగా వివాహం చేసుకుంటే చాలామంది సంతోషపడేవారు ఉన్నారు. ఈ విషయం పైన అనుష్క ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: