నటి టబు గురించి స్పెషల్ గా చెప్పినా అవసరం లేదు. టబు పక్కా హైదరాబాద్ అమ్మాయి. నార్త్, సౌత్ లోనూ ఎన్నో రకాల సినిమాలలో నటించి టబు విపరీతంగా ఫేమస్ అయ్యింది. టబు సినిమాలన్నీ చాలా వరకు మంచి కంటెంట్ ఉన్న స్టోరీతో వస్తాయి. చాలామంది హీరోయిన్ల సినిమాలతో పోల్చినట్లయితే టబు సినిమాలు చాలా బాగుంటాయి. కాగా, టబు వయసు ప్రస్తుతం 53 ఏళ్లు. అయినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది. 

టబు హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో చాలామంది హీరోలతో ఎఫైర్లు కొనసాగించినట్లు అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అందులో కొంతమంది స్టార్ హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ టబు వారిలో ఎవరిని కూడా వివాహం చేసుకోలేదు. ఇదిలా ఉండగా.... టబు కొంత కాలం నుంచి సినిమాలలో నటించడం లేదు. గత కొన్ని రోజుల నుంచి టబు స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తోంది.


అంతే కాకుండా బోల్డ్ అటెంప్ట్ లు విడిచి పెట్టకుండా చేస్తోంది. దానివల్ల టబు కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంది. ఇది చూసిన చాలామంది 53 ఏళ్ల వయసులోనూ బోల్డ్ పాత్రలు చేయడం అవసరమా అనే విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. కానీ వాటిని పట్టించుకోకుండా టబు వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అందులో ఓ సినిమా క్రూ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం టబు బూత్ బంగ్లా అనే హిందీ సినిమాలోనూ నటిస్తోంది. కాగా, టబు కమిట్ అయిన చిత్రాల్లో ఇదొక్కటే కనిపిస్తోంది.


 టబు కమిట్ అయిన సినిమాలలో ఇదొక్కటే కనిపిస్తోంది. కొత్త సినిమాలు ఏవి తాను కమిట్ అయిన సినిమాలలో ఉన్నట్లుగా కనిపించడం లేదు. మరి టబు ఈ సంవత్సరంలో తెలుగు సినిమాలు ఏవైనా చేస్తుందా అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. ఒకవేళ టబు తెలుగులో సినిమా అవకాశాలు వచ్చిన చేస్తుందా లేదా అనే సందేహంలో చాలామంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: