ఈ మధ్యకాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వారి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా వారి పేర్లను, ఫోటోస్ ని షేర్ చేస్తున్నారు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్లే ఇప్పుడు ముఖ్య పాత్రలో హీరోయిన్ గా చాలా సినిమాలలో కనిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో నేటింటా చాలా వైరల్ అవుతుంది. అయితే ఆ ఫోటో ఎవరిది.. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తున్నారా. వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాలో చిన్న కూతురిగా నటించిన అమ్మాయిది. ఇప్పుడు ఈ బుజ్జి పాప, బ్యూటిఫుల్ అమ్మాయిగా మారింది. తన అందం, నటనతో సోషల్ మీడియాలో తాను చేసే సందడి అంతా ఇంత కాదు.  

నటి ఎస్తేర్ అనిల్ మలయాళం సినిమాలలో ఎక్కువగా నటిస్తుంది. ఈమె 2010లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నల్లవన్ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించింది. 2013 లో ఈమె తెలుగులో విక్టరీ వెంకటేష్, నటి మీనా నటించిన దృశ్యం సినిమా ద్వారా టాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఎస్తేర్ అనిల్ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా కేరళ ఫిల్మ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డును గెలుచుకుంది. ఈమె మలయాళం సినిమాలలోనే కాదు తెలుగు, తమిళం సినిమాలలో కూడా నటించింది. చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలను కొట్టేసి.. గుర్తింపు సంపాదించుకుంది.

నిన్న మొన్నటివరకు చిన్న పిల్లగా కనిపించిన ఈ చిన్నారి.. ప్రస్తుతం అంచెలంచాలుగా ఎదుగుతూ తెలుగు సినిమా జోహార్ లో ఈమె ప్రధాన పాత్రలో కనిపించింది. మలయాళం సినిమాలలో కూడా నటించిన ఈ అందాల భామ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. పలు సినిమాలలో హీరోయిన్ గా నటించినప్పటికి, అంతగా గుర్తింపు రాలేదు. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా నిత్యం ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడు ఈమె ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు ప్రేక్షకులు అయితే అప్పుడు ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉంది, చూస్తేనే మతిపోతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.       


మరింత సమాచారం తెలుసుకోండి: