
సందర్భంగా అక్కడ మీడియాతో ముచ్చటిస్తూ ముమైత్ ఖాన్ పెళ్లి ప్రశ్న ఎదురవగా.. ఇలా సమాధానాన్ని తెలిపింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో తెలియదు అని చెప్పగానే వరుడు ఎలాంటి వారు కావాలని మళ్లీ ప్రశ్నించగా.. ఆమె తెలియదని సమాధానం చెప్పింది ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కూడా బిజినెస్ వైపుగానే ఉన్నదని వెల్లడించినది. అలాగే తన ఫేవరెట్ హీరో ఎవరనే ప్రశ్న కూడా ఎదురవగా అందుకు తాను హీరోలు అందరితో వర్క్ చేశాను కాబట్టి ప్రస్తుతం తన ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అని తెలియజేసింది.
హిందీలో పుష్ప సినిమాను చూశానని వెల్లడించింది. హైదరాబాదులో తనకి సెటిల్ అవ్వడం ఇష్టం లేదని ట్రావెల్ చేయడమే ఎక్కువగా ఇష్టపడతానని.. తనని నమ్ముకొని తన తల్లి ఉందని తెలియజేసింది ముమైత్ ఖాన్. ప్రస్తుతమైతే తాను చాలా ఆనందంగా ఉన్నానని.. తన డ్యాన్స్ని స్టెప్పులను గుర్తు పెట్టుకొని అవకాశాలు ఇస్తే తాను ఇప్పటికీ ఐటెం సాంగ్లు చేస్తానని తెలియజేసింది. మ్యూజిక్ అంటే తనకు చాలా ఇష్టమని ప్రస్తుతం సినిమాలలో ఎన్నో మార్పులు వచ్చాయి కాబట్టి చాలామంది హీరోలు కూడా పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు అంటూ తెలియజేసింది ముమైత్ ఖాన్. మొత్తానికి పెళ్లి మాత్రం నో అంటూ బిజినెస్ ఇష్టమంటోంది ముమైత్ ఖాన్.