‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న ‘దేవర’ కలక్షన్స్ రికార్డులను సృష్టించడంలో వెనకపడిన విషయం తెలిసిందే. దీనితో సోలో హీరోగా జూనియర్ నుండి 1000 కోట్ల కలక్షన్స్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులు కలలు కాంతున్నారు. ఈ సంవత్సరం ఆగష్టు 15కు జూనియర్ హృతిక్ రోషన్ తో కలిసి నటించిన ‘వార్ 3’ విడుదల అవుతున్నప్పటికీ ఆమూవీ జూనియర్ సోలో మూవీ కాదు.



దీనితో అభిమానుల ఆశలు అన్నీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ నటించబోయ్ భారీ యాక్షన్ మూవీ పైనే ఉన్నాయి. ‘కేజీ ఎఫ్’ మూవీతో సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ తమ హీరోతో చేయబోయే సినిమా కథ ఏమిటి అన్న ఆశక్తి అభిమానులతో పాటు అందరిలోను  ఉంది. లేటెస్ట్ గా ఈమూవీ షూటింగ్ మొదలైంది. దాదాపు 3000ల మంది జూనియర్ ఆర్టిస్టులతో తారక్ లేకుండా ఒక సీన్ ను ప్రశాంత్ నీల్ చిత్రీకరించాడు.



త్వరలో జూనియర్ ఈమూవీ షూటింగ్ లో పాల్గొనడమే కాకుండా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలి అన్న మాష్టర్ ప్లాన్ లో ఈమూవీ నిర్మాతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీ కథ గోల్డెన్ ట్రయాంగిల్ స్వర్ణ త్రిభుజం చుట్టూ తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి.



ఈశాన్య మయన్మార్, వాయువ్య థాయ్ లాండ్, ఉత్తర లావోస్ లను కలుపుతూ ఏర్పడిన అతి పెద్ద కొండ ప్రాంతమే గోల్డెన్ ట్రయాంగిల్ అని అంటారు. 1950 నాటి ప్రాంతంలో ఈప్రాంతం నల్ల మందు తయారీకి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోకెల్లా అత్యధిక నల్లమందు ఉత్పత్తి ఇక్కడే జరిగేది అని అంటారు. ఇక్కడ నుండే మన భారత్ కు కూడా డ్రగ్స్ సరఫరా జరుగుతూ ఉండేదని అనేక కథనాలు ఉన్నాయి. 1970 సమయంలో ఈ మాఫియా ప్రపంచాన్ని షేక్ చేస్తున్న పరిస్థితులలో ఆ మాఫియా ప్రపంచంలో నాయకుడుగా ఎదిగిన పాత్రగా జూనియర్ పాత్ర డిజైన్ చేశారని టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: