గత కొంత కాలంగా టాప్ హీరోల సినిమాలలో విలన్ పాత్రలకు కూడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతినాయక పాత్ర ఎంత ఎలివేట్ అయితే అంతకు మించిన రేంజ్ లో టాప్ హీరోల సినిమాలు బ్లాక్ బష్టర్ హిట్ అవుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘అఖండ 2’ మూవీకి ఈ ట్రెండ్ ను దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ అనుకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.



‘లెజండ్’ మూవీ నుంచి ప్రారంభం అయిన బాలయ్య గ్రాఫ్ సినిమాసినిమాకు పెరిగిపోతోంది. ‘అఖండ’ ‘వీరసింహా రెడ్డి’ ‘భగవంత్ కేసరి’ ‘డాకు మహరాజ్’ ఇలా 4 సినిమాలు వరసగా హిట్ అవ్వడంతో బాలయ్య మ్యానియా నేటితరం ప్రేక్షకులకు కూడ తాకింది. దీనితో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘అఖండ 2’ పై అత్యం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు అనుగుణంగానే బోయపాటి ఈమూవీ కథ విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.



ఈమూవీలో అఘోరా గా బాలయ్య నట విశ్వరూపం మళ్ళీ చూడబోతున్నాడు. అనుకోకుండా ఈసినిమా షూటింగ్ జరిగే సమయానికే ప్రయాగలో ‘మహా కుంభమేళ’ జరగడంతో ఆ కుంభమేళాకు వచ్చిన అనేకమంది అఘోరాల పై కొన్ని సన్నివేశాలు ఈమూవీ కోసం తీయడంతో ఈమూవీలోని ఈ కీలక సీన్ హైలెట్ గా మారుతుంది అని అంటున్నారు. అంతేకాదు ఈమూవీలో కీలకమైన ప్రతినాయక పాత్రను పోషించడానికి సంజయ్ దత్ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.



త్వరలో షూటింగ్ స్పాట్ కు సంజయ్ దత్ వచ్చిన తరువాత బాలకృష్ణ సంజయ్ దత్ లపై కొన్ని కీలక సన్నివేశాలను బోయపాటి చిత్రీకరిస్తాడాని తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీ బాలకృష్ణ కెరియర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా మారబోతోంది. బాలయ్య ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాలు దాటి పోతున్నప్పటికీ అతడి సినిమాలు ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలుగా విడుదల కాలేదు. అయితే ఇప్పుడు ‘అఖండ 2’ ను భారీ స్థాయిలో అన్ని భాషలలొ విడులచేయబోతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: