చాలామంది హీరోయిన్లు పెళ్లయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్పడం అనేది కామనే.. అయితే కొంతమంది హీరోయిన్లు పెళ్ళై పిల్లలు పుట్టినా కూడా సినిమాల్లోనే రాణిస్తూ ఉంటారు.. అయితే పెళ్లయ్యాక హీరోయిన్లకు భర్త సపోర్ట్ ఉంటే కచ్చితంగా రాణించగలుగుతారు.కానీ భర్తలు సినిమాల్లో వద్దు ఇక చేసింది చాలు అని చెప్పినా కూడా లేక భర్త తరుపున ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా సినిమాలకు దూరమవ్వాల్సి వస్తుంది. అయితే తాజాగా కీర్తి సురేష్ కండిషన్ కూడా అలాగే ఉంది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం కీర్తి సురేష్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి వ్యాపార రంగంలో రాణించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం కీర్తి సురేష్ తాజాగా సిల్వర్ స్క్రీన్ పై కాకుండా బుల్లితెరపై కనిపించింది.అయితే చాలామంది హీరోయిన్లు బుల్లితెరపై కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు.ఈ మాత్రం దానికే సినిమాలు వదిలేసిందని మాట్లాడుకోవాలా అని మీరు అనుకోవచ్చు. అయితే బుల్లితెర పైకి రావడం మామూలు విషయమే.కానీ స్టార్టప్ సింగం లో పెట్టుబడిదారురాలిగా మారడం మాత్రం కొంతమందిలో అనుమానం కలిగిస్తుంది. ఎందుకంటే స్టార్టప్ సింగంలో పెట్టుబడి పెట్టి కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పి బిజినెస్ రంగంలోనే రాణిస్తుందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు.

అయితే తన భర్త ఆంటోనీ తట్టిల్ బిజినెస్ మ్యాన్ అనే సంగతి మనకు తెలిసిందే.ఇక భర్త అడుగుజాడల్లోనే కీర్తి సురేష్ కూడా సినిమాలకు గుడ్ బై చెప్పి బిజినెస్ రంగంలో రాణిస్తుంది కావచ్చు అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంత మందేమో భర్త సినిమాలు మానేయమని టార్చర్ చేస్తున్నాడు కావచ్చు అందుకే సినిమాలు మానేసి భర్తతో పాటే బిజినెస్ చూసుకుంటుంది కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెబుతుందా.. లేక అటు సినిమాలు ఇటు బిజినెస్ లు కూడా చూసుకుంటుందా అనేది

మరింత సమాచారం తెలుసుకోండి: