ఒకప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటే బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై ఉండేవి.. ఆ ట్రెండ్ పూర్తిగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి పడింది.. ఇప్పుడు ఏ హీరో అయిన పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ హిట్ అందుకుంటున్నారు. అలాంటి ఈ తరుణంలో  చాలామంది పాన్ ఇండియా హీరోలు మల్టీ స్టార్లుగా నటించాలని భావిస్తున్నారు.. చివరికి పాన్ ఇండియా లెవెల్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కూడా మల్టీ స్టార్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. అయితే మల్టీ స్టార్ ట్రెండ్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు.. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి ఈ ట్రెండ్ ఉంది. కానీ ఆ మధ్యకాలంలో కాస్త తగ్గిపోయింది. ప్రస్తుతం మళ్ళీ మల్టీ స్టార్ సినిమాలు వస్తూ మంచి హిట్ అవుతున్నాయి.. 

అంతే కాదు అభిమానులు కూడా ఆ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే బాగుండు అని వారి కాంబోను వారే సెట్ చేస్తున్నారు.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టిస్టార్లుగా వచ్చిన చాలా చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ లో అద్భుత హిట్ సాధిస్తున్నాయి..అలాంటి ఈ తరుణంలో  స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ కాంబోలో ఒక సినిమా రాబోతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ కోసం అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూశారు. కానీ చివరికి ఆ కాంబో మిస్ అయిపోయింది. ఆ వివరాలు ఏంటో చూద్దామా.. హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రెబల్' మూవీ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

 అయితే ఈ చిత్రంలో ముందుగా ప్రభాస్ తో పాటు ఎన్టీఆర్ ను కూడా తీసుకోవాలనుకున్నారట. దీని కోసం ఎన్టీఆర్ ను కూడా సంప్రదించారట. కానీ ఎన్టీఆర్ కు ఆ సమయంలో వేరే సినిమా డేట్స్ ఉండడంతో కుదరదని చెప్పారట. దీంతో ఎన్టీఆర్, ప్రభాస్ కాంబోలో వచ్చే సినిమా మిస్సైంది. ఆ తర్వాత రెబల్ చిత్రంలో ప్రభాస్ మాత్రమే చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం మిస్ అయిన తర్వాత ఎన్టీఆర్  ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన హిట్ సాధించింది.. అంతే కాదు ఈ చిత్రంలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: