టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో నాగ చైతన్య ఒకరు. ఈయన అక్కినేని నాగార్జున నట వారసుడుగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. జోష్ మూవీ తో వెండి తెరకు కి పరిచయం అయిన చైతూ మొదటి మూవీ తో అపజయాన్ని అందుకున్న నటుడిగా మాత్రం మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో హీరో గా నటించగా అందులో కొన్ని మూవీ లు మంచి విజయాలను అందుకున్నాయి. దానితో ఈయనకు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు ఉంది.

తాజాగా చైతూ "తండెల్" అనే సినిమాలో హీరో గా నటించాడు. సాయి పల్లవిమూవీ లో చైతూ కి జోడిగా నటించగా ... చందు మండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్ , వాసు ఈ సినిమాను నిర్మించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం ఫిబ్రవరి 7 వ తేదీన తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి మంచి టాక్ వచ్చింది. దానితో ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే కూడా ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటుంది.

ఇకపోతే ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ మూవీ చాలా రోజుల పాటు మంచి కలెక్షన్ లను వసూలు చేస్తుంది అని అనేక మంది భావించారు. కానీ ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయ్యాయి. అందులో చాలా మూవీలకు మంచి టాక్ వచ్చింది. దానితో తండెల్ మూవీ కలెక్షన్స్ చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో తగ్గాయి అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc