ఇది నిజంగా అల్లు అర్జున్ అభిమానులకు ఎగిరి గంతేసే న్యూస్ అని చెప్పాలి . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బన్నీని బాగా ట్రోల్ చేశారు కొంతమంది పని పాట లేని బ్యాచ్.  ఆయన తప్పు లేకపోయినా సరే కావాలని ఆయనను గెలికి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆయన పేరుని హైలెట్ చేస్తూ పలువురు పైశాచిక ఆనందాన్ని పొందారు. కానీ బన్నీ మాత్రం అలాంటివి పెద్దగా ఏం పట్టించుకోలేదు . కాగా బన్నీ కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్  తీసుకుంటాడు అని అంత అనుకున్నారు.  కానీ బన్నీ మాత్రం అలా చేయనే చేయలేదు.

ఎవరు ఊహించిన విధంగా తన సినిమాలను జెట్ స్పీడ్ లో కమిట్ అవుతూ ముందుకు తీసుకెళుతున్నాడు. త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఆ తర్వాత అట్లీ కాంబోలో సినిమాలను సెట్స్ పైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది.  అయితే ఇదే మూమెంట్లో బన్నీకి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ ఒక సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు బాగా హైలైట్ గా మారింది . ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.." అల్లు అర్జున్.. బాలీవుడ్ లో ఒక సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నారట".  కేవలం  ఫ్రెండ్షిప్ కోసమే ఈ రోల్ ని  ఆయన ఓకే చేశారట. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నారట . నిజానికి పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జున్ కి బాలీవుడ్ లో బడాబడా ఆఫర్స్ వస్తున్నాయి . మరి ఇలాంటి మూమెంట్లో గెస్ట్ పాత్రను ఓకే చేయడం బిగ్ సాహసం అని అంటున్నారు జనాలు.  కానీ ఫ్రెండ్షిప్ కోసం అల్లు అర్జున్ ఏమైనా చేస్తాడు.  ఆ కారణంగానే అల్లు అర్జున్ ఇప్పుడు ఈ దర్శకుడి సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించడానికి ఓకే చేశాడు అంటున్నారు జనాలు . ప్రజెంట్ ఇదే న్యూస్ అటు బాలీవుడ్ ..ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: