సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా ఏ హీరోయిన్ అయినా సరే మేకప్ వేసుకుని నటించడం సర్వసాధారణం . చాలామంది మేకప్ లేకుండా బయట కనిపించరు.  హీరోయిన్స్ అయితే మరీ దారుణం.  సినిమాలోనే కాదు బయట ఎక్కడికి వెళ్లినా సరే బాగా దట్టంగా మేకప్స్ వేసుకొని మరీ కనిపిస్తూ ఉంటారు.  కొంతమంది హీరోయిన్స్ మాత్రం అలా మేకప్ వేసుకోకుండా కనిపిస్తూ ఉంటారు . అది చాలా చాలా రేర్ . అందులో సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ మాత్రమే మనం చూడగలం.

అయితే సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోలు కూడా మేకప్ వేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఏదో లైట్గా సినిమా కోసం మేకప్ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్పిస్తే బాలీవుడ్ స్టార్స్ లా ఎక్కువ టైం దానికి స్పెండ్ చేయడానికి ఇష్టపడరు . మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మేకప్ వేసుకోవడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించరు . ఈ విషయం చాలామందికి తెలుసు . అయితే జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో ఒక సినిమాలో అసలు జీరో మేకప్ తో కనిపించాడు. ఆ సినిమా మరేదో కాదు "నరసింహుడు".

ఎస్ ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ అసలు మేకప్ నే  వేసుకోలేదు . నాచురల్ గా ఎలా ఉన్నాడో అలాగే కనిపించాడు . ఈ సినిమా ఫ్లాప్ టాక్ దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్ నటన పరంగా మాత్రం మంచి మార్కులే పడ్డాయి . ప్రెసెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్  చేస్తున్నారు నందమూరి అభిమానులు. జూనియర్ ఎన్టీఆర్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . ఒకపక్క వార్ 2 ను కంప్లీట్ చేశాడు . మరొకపక్క దేవర 2 అదే విధంగా మరొక బడా దర్శకుడు డైరెక్షన్లో సినిమాని ఓకే చేసినట్లు తెలుస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: