మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కన్నడ సినిమాల ద్వారా సినిమా ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. ఇక కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత ఈ నటి తెలుగు సినిమాల వైపు ఇంట్రెస్ట్ ను చూపడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈమె ఛలో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకుంది.

ఆ తర్వాత కూడా ఈమెకు వరస పెట్టి విజయాలు రావడం , స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడంతో చాలా తక్కువ కాలం లోనే ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇక అలాంటి సమయం లోనే ఈమె అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి సక్సెస్ కావడంతో ఈమెకు హిందీ లో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ఈమెకు పుష్ప తర్వాత హిందీ లో నటించిన సినిమాల ద్వారా పెద్దగా విజయాలు దక్కలేదు. ఇక కొన్ని రోజుల క్రితమే పుష్ప 2 మూవీ విడుదల అయింది. ఈ సినిమా ఏకంగా హిందీ లో ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేసింది. ఈ మూవీ తో రష్మిక క్రేజ్ హిందీ లో మరింతగా పెరిగింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ చావా అనే హిందీ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో రష్మిక క్రేజ్ హిందీ లో మరింతగా పెరిగి పోయింది. ఈమెకి హిందీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉండడంతో వరస పెట్టి హిందీ క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది.

హిందీలో వరుస అవకాశాలు వస్తూ ఉండడంతో ఈమె తెలుగు సినిమాల్లో నటించడానికి మునపటిలా ఇంట్రెస్ట్ చూపుతోందా ... లేక హిందీ సినిమాల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతోందా అనే దానిపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మరి రష్మిక ఎలాంటి నిర్ణయాన్ని తీసుకొని ఏ ఇండస్ట్రీ సినిమాలలో ఎక్కువగా నటిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: