
మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమా కోసమే ఆయన ఫుల్ టైమ్ స్పెండ్ చేసేస్తున్నారు . అంతేకాదు రాజమౌళితో సినిమా అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి . మరీ ముఖ్యంగా రీసెంట్గా మహేష్ బాబు పాస్ పోర్ట్ లాగేసుకున్న ఒక ఫోటో కూడా బాగా ట్రెండ్ అయింది . అయితే రీసెంట్ గా దుబాయిలో వెడ్డింగ్ అటెండ్ అవ్వడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కదిలి వెళ్ళింది . చిరంజీవి - నాగార్జున -నమ్రత -ఉపాసన - ఎన్టీఆర్ అందరూ కూడా ఇలా దుబాయిలో మీట్ అయ్యి బాగా ఎంజాయ్ చేస్తున్నారు .
అయితే మహేష్ బాబు మాత్రం ఈ వెడ్డింగ్ కి అటెండ్ కాలేదు. ఈ క్రమంలోనే అక్కడ వాళ్ళు వెడ్డింగ్ లో దిగిన ఫోటో లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మూమెంట్లో మహేష్ బాబు ఫ్యాన్స్ రాజమౌళిని సరదాగా ఆట పట్టిస్తున్నారు . రాజమౌళి .."మహేష్ అన్న పాస్ పోర్ట్ ఒకసారి ఇవ్వరాదు ..అలా పెళ్లికి వెళ్లి ఇలా వచ్చేస్తాడు" అంటూ మాట్లాడుతున్నారు. కొంతమంది మాత్రం జక్కన్న మహామొండొడు..సినిమా కంప్లీట్ అయ్యేవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మహేష్ బాబుకి పాస్ పోర్ట్ ఇవ్వనే ఇవ్వడు అంటూ మాట్లాడుతున్నారు. రాజమౌళి తో సినిమా అంటే కొన్ని కొన్ని సరదాలు వదులుకోవాల్సిందే..!