న్యాచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న నాని ఈరోజు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. నాని పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగ రోజు అనే సంగతి తెలిసిందే. నాని మొదటి సినిమా అష్టాచమ్మా కాగా అప్పటినుంచి ఇప్పటివరకు నాని కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు.
 
ఒకానొక దశలో వరుస ఫ్లాపులు నాని కెరీర్ ను ఇబ్బంది పెట్టాయి. ఆ సమయంలో నాని కెరీర్ పరంగా పుంజుకోవడం సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే నాని మాత్రం కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యే విషయంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నాని రెమ్యునరేషన్ 30 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే.
 
మిడిల్ రేంజ్ హీరోలలో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడంతో పాటు వరుస విజయాలు సాధించడం నానికి మాత్రమే సాధ్యమైందని చెప్పవచ్చు. నాని నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది. న్యాచురల్ స్టార్ నాని నటించిన హిట్3 సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల కానుంది.
 
హిట్3 సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథ, కథనం కొత్తగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ గా నాని ఈ సినిమాలో కనిపించనున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నాని కెరీర్ ను ఏ రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారో చూడాల్సి ఉంది. నాని క్రేజ్ మాత్రం మామూలుగా లేదని నిర్మాతగా కూడా నాని సక్సెస్ అవ్వాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నాని త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను సైతం ప్రకటించనున్నారని తెలుస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: