
ప్రశాంత్ నీల్ – టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా పై జాతీయ మీడియా వర్గాల్లోనూ రోజుకొక రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను రెడీ చేశారు. దీని కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రశాంత్ నీల్ అయితే షూటింగ్ లోకి దిగిపోయాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ లేని సన్నివేశాలు చిత్రీకరి స్తున్నారు. ఇక ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా డ్రాగన్ అనే టైటిల్ పెట్టిన ట్టు ప్రచారం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఆ సెట్ లోనే జరుగుతుంది. మార్చి మూడో వారం నుంచి ఎన్టీఆర్ ఈ ఫిల్మి సిటీలో వేసిన సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నాడు. ఎన్టీఆర్ పై మొదట యాక్షన్ సీన్స్ తో రెండో షెడ్యూల్ ను స్టార్ట్ చేస్తారట.
సినిమా లో యాక్షన్ సీన్లు అయితే ఓ రేంజ్ లో ఉంటాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ పీరియా డిక్ మాస్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా కనిపించబోతుంది. మలయాళ యువ హీరో టొవినో థామస్ కూడా కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ఈ సినిమాను ఇండియన్ సినిమా హిస్టరీ లోనే కనివినీ ఎరుగని రీతిలో తెరకెక్కిస్తానని చెప్పడంతో అంచనాలు అయితే మామూలుగా లేవు.