హీరోయిన్ ప్రియమణి గురించి పరిచయాలు అక్కర్లేదు.ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే నేషనల్ అవార్డు అందుకుంది.అలా తన నటనతో ఎంతో మందిని కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి వచ్చి సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా అందరు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ అనే తేడాలు లేకుండా అన్ని భాషల్లో రాణించింది. ఇక ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు దాటినా కూడా ఇంకా చేతినిండా అవకాశాలతో దూసుకుపోతుంది అంటే ప్రియమణికి చిత్రసీమ పరిశ్రమలో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా ఆలీతో సరదాగా అనే షోకి వచ్చిన సమయంలో తనపై వచ్చిన ఒక రూమర్ గురించి క్లారిటీ ఇచ్చింది. అదేంటంటే గతంలో తరుణ్ ప్రియమణి కాంబోలో నవవసంతం సినిమా వచ్చింది. 

అయితే ఈ సినిమా షూట్ అయిపోయాక తరుణ్ ప్రియమణి ఇద్దరూ ప్రేమలో పడ్డారని వీరి పెళ్లికి తరుణ్ తల్లి రోజా రమణి కూడా ఓకే చేసినట్టు వార్తలు వినిపించాయి. అంతేకాదు తరుణ్ ప్రియమణిల పెళ్లికి ముందే చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని,ఇద్దరు ఒకే ప్లాట్ తీసుకొని సహజీవనం కూడా మొదలెట్టేశారంటూ రూమర్లు క్రియేట్ చేశారు. ఇక ఇంకొంతమంది అయితే తరుణ్ చాలా గొప్ప మనసుతో తన ప్రియురాలు ప్రియమణికి పెళ్లికి ముందే చాలా ఖరీదైన కారు ను బహుమతిగా ఇచ్చారు అంటూ ఇలా ఎన్నో రూమర్లు మీడియాలు చక్కర్లు కొట్టాయి.

 అయితే ఈ రూమర్లన్నింటికీ తెరపడేలా తాజాగా ప్రియమణి క్లారిటీ ఇచ్చింది.నాకు తరుణ్ కి పెళ్లి ఫిక్స్ అయిందని,తరుణ్ వాళ్ళ అమ్మ కూడా ఈ పెళ్లికి ఓకే చెప్పి మా ఇద్దరి పెళ్లికి ముహూర్తాలు పెట్టించిందని, తరుణ్ నాకు పెళ్లికి ముందే ఎక్స్పెన్సివ్ కారు ను గిఫ్ట్ గా ఇచ్చారంటూ ఎన్నో రూమర్లు క్రియేట్ చేశారు.అయితే ఈ రూమర్లపై నేను చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే మా ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లి లాంటిది ఏమీ లేదు. కేవలం సినిమాల్లో కలిసి నటించడం తప్ప ఆ తర్వాత మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. కానీ ఈ రూమర్ల వల్ల నాకు చాలా బాధేసింది. అలాగే ఈ రూమర్లు క్రియేట్ చేసిన వారిపై కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యాను అంటూ ప్రియమణి క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: