కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ప్రియాల మధ్య ప్రేమ పెళ్లి చాలా విచిత్రంగా జరిగింది. ముఖ్యంగా వీరిద్దరి ప్రేమ పెళ్లిలో సినిమాను మించిన ట్విస్టులు ఉన్నాయి.అలా ఎంతో గాఢంగా ప్రేమించుకున్న సుదీప్ ప్రియలు ఒకానొక సమయంలో విడాకులకు కూడా అప్లై చేశారు.అది కూడా ఓ హీరోయిన్ కోసమని కన్నడ మీడియాలో అప్పట్లో కొన్ని వార్తలు జోరుగా వినిపించాయి.మరి ఇంతకీ ఎంతో గాఢంగా ప్రేమించుకున్న సుదీప్ ప్రియలు విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..సినిమాల మీద ఉన్న పిచ్చితో యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నారు సుదీప్.అలా ప్రియా చదివే కాలేజీలోనే నటనా రంగంలో శిక్షణ తీసుకున్న సమయంలో ప్రియా ని తొలిచూపులోనే ఇష్టపడ్డాడు సుదీప్.ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. 

సుదీప్ హీరో కాకముందు ప్రియా చాలా ఉద్యోగాలు చేసింది.అలా విమానంలో హెల్పర్ గా,బ్యాంకు జాబర్ గా ఇలా పలు ఉద్యోగాలు చేసినప్పటికీ పెళ్లయ్యాక సుదీప్ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత అన్ని వదిలేసి ఇంటిపట్టునే కూర్చుంది.ముఖ్యంగా సుదీప్ కి ప్రియ ఒక అదృష్టం లాంటిది. ఎందుకంటే సుదీప్ లైఫ్ లోకి ప్రియా వచ్చాక ఆయన జీవితం మారిపోయిందట.అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే వీరికి ఒక పాప కూడా ఉంది. ఇక ఎప్పుడైతే సినిమాల్లోకి సుదీప్ వచ్చి స్టార్ అయ్యారో అప్పటినుండి ఈయనపై వార్తలు కూడా ఎక్కువగానే వినిపించాయి.

అలా హీరోయిన్ నిత్యమీనన్ తో సుధీప్ ప్రేమలో ఉన్నారని,వారిద్దరు డేటింగ్ చేస్తున్నారని, సుదీప్ నిత్యా మీనన్ ని రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారంటూ కూడా రూమర్లు వినిపించాయి. ఇక ఈ రూమర్లకు ఆజ్యం పోసేలా సుదీప్ ప్రియ ఇద్దరు విడాకులకు కూడా అప్లై చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే వీరు విడాకులకు అప్లై చేసింది నిజమే కానీ కూతురు కారణంగా వీరు విడాకులను రద్దు చేసుకున్నారట. అయితే వీరిద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటో తెలియదు కానీ నిత్యామీనన్ వల్లే ఈ జంట విడాకులు తీసుకోవాలనుకున్నారనే రూమర్లు మాత్రం కన్నడ మీడియాలో ఎక్కువగా వినిపించాయి. నిత్యమీనన్ పచ్చని జంటని విడదీసింది అంటూ ఎంతో మంది ఆమెపై విమర్శలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: