
నందమూరి హీరోలతో నటించిన హీరోయిన్స్ ఎవరో కాదు కాజల్ అగర్వాల్, ప్రియమణి. ప్రస్తుతం నందమూరి హీరోలు కూడా తమ సినిమాలపరంగా బిజీగా పోతున్నప్పటికీ కాజల్ అగర్వాల్ కూడా వివాహం చేసుకొని కొడుకుకి జన్మనిచ్చినప్పటికీ కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. వివాహం తర్వాత కొంతవరకు గ్యాప్ ఇచ్చిన మళ్లీ హీరోయిన్ గా నటిస్తూ ఉన్నది. ఇక కళ్యాణ్ రామ్ తో లక్ష్మీ కళ్యాణం సినిమాలో నటించగా బాలకృష్ణతో భగవంత్ కేసరి, జూనియర్ ఎన్టీఆర్ తో టెంపర్, బృందావనం సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ.
అయితే సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది కాజల్ అగర్వాల్. అంతేకాకుండా తన భర్తతో కలిసి నిర్మాణ సంస్థలో కూడా భాగస్వామ్యం అయినట్లుగా గతంలో వార్తలు వినిపించాయి. మళ్ళీ అందుకు సంబంధించిన ఏ విషయాలను మాత్రం తెలియజేయలేదు. కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ కూడా హీరోయిన్గా పలు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో కాజల్ కంటే ముందుగానే వివాహం చేసుకున్నది. అలాగే మరొక హీరోయిన్ ప్రియమణి కూడా బాలకృష్ణతో మిత్రుడు, ఎన్టీఆర్ తో యమదొంగ, కళ్యాణ్ రామ్ తో హరే రామ్ వంటి చిత్రాలలో నటించారు. టాలీవుడ్లో కేవలం ఇద్దరి హీరోయిన్స్ నందమూరి హీరోలతో నటించారు. ప్రియమణి కూడా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ కీలకమైన పాత్రలో నటిస్తూ మెప్పిస్తుంది అలాగే పలు రకాల వెబ్ సిరీస్లతో కూడా సక్సెస్ లు అందుకుంటోంది.