సాధారణంగా జనాలు ఒక విషయాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు . సినిమా హిట్ అవ్వడానికి కారణం డైరెక్టర్ లేదా హీరో అని.. సినిమాలో హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్ టచ్ కి మాత్రమే పనికొస్తుంది అని.. ఎప్పుడూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు . అఫ్ కోర్స్ అది అబద్ధం అంటూ చాలామంది హీరోయిన్స్ ప్రూవ్ చేశారు.  లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడమే కాకుండా హీరో లేకుండా కూడా మేము కలెక్షన్స్ రాబట్టగలము అంటూ ప్రూవ్ చేశారు . 


కాగా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీ నటులు ఉన్న ఒక రేర్ రికార్డు మాత్రం ఒక్క హీరోయిన్ కే దక్కింది . ఆ నటి మరెవరో కాదు రమ్యకృష్ణ . బాహుబలి సినిమాతో మూడు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న రమ్యకృష్ణ అరుదైన రికార్డ్ కూడా సాధించింది . బాహుబలి రెండు పార్ట్స్ గా తెరకెక్కిన విషయం అందరికీ తెలుసు . బాహుబలి సినిమాలో శివగామిగా ఆమె పర్ఫామెన్స్ హైలెట్ అనే చెప్పాలి . ఆమె కెరియర్ లో ఎన్నో బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్న అందరికీ ది మోస్ట్ ఫేవరెట్ గా నిలిచేది మాత్రం బాహుబలినే.



ఆమె రోల్ సినిమాలో చాలా చాలా కీలకం " మాటే శాసనం" అంటూ షేక్ చేసి పడేసింది . కాగా బాహుబలి 2 ఇండియా వైట్ 1810కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సంగతి అందరికీ తెలిసిందే.  దీంతో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమా చేసిన మొదటి నటి గా రమ్యకృష్ణ రేర్ రికార్డ్ అందుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ - అనుష్క - తమన్నా - రానా లాంటి స్టార్స్ ఉన్నా కూడా అందరూ రమ్యకృష్ణ ని చూసి ఫిదా అయిపోయారు అంటే ఆమె ఎంత టాలెంటెడ్ పర్సన్ అనేది అర్థం చేసుకోవచ్చు.  ఈ సినిమా ఎప్పటికీ రమ్యకృష్ణ ఫ్యాన్స్ కి సో స్పెషల్. అలా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్పెషల్ పేజీని క్రియేట్ చేసుకున్నది రమ్యకృష్ణ. కాగా ప్రజెంట్ ఆమెకు పలు సినిమాలలో హీరోకి హీరోయిన్ కి తల్లి పాత్రలు వస్తున్న సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది . తన మనసుకు నచ్చిన పాత్రలనే చూస్ చేసుకుంటూ ఓకే చేస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: